అఖిలప్రియకు చుక్కెదురు: బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ

సోమవారం, 18 జనవరి 2021 (15:29 IST)
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ) కేసు నమోదు చేశారు. జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావంటూ సికింద్రాబాద్ కోర్టు పేర్కొంది. దీంతో బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం రీటర్న్ చేసింది.
 
సికింద్రాబాద్ కోర్టు తోసిపుచ్చడంతో నాంపల్లి కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వేయనుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైల్లో పెట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కొంతమంది పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు