రూ.ఐదు లక్షలు.. స్టవ్ మీద తగలబెట్టాడు.. వీడెవడ్రా బాబూ..?

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (20:03 IST)
అసలే కరోనా కాలం. జనాలు ఆర్థికపరంగానూ, ఆరోగ్య పరంగానూ నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి డబ్బును చేతులో పెట్టుకుంటే చిక్కుకుంటానని భావించిన ఓ తహసిల్దార్ ఐదు లక్షల రూపాయలను గ్యాస్ స్టౌవ్ మీద పెట్టి తగలబెట్టేశాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరెంతకుంట తండా సర్పంచ్ రాములు... వెల్దండ మండలం బొల్లంపల్లిలో కంకర మిల్లు నడుపుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేసి... నిరంభ్యతర పత్రం ఇవ్వాల్సిందిగా వెల్దండ తహశీల్దార్ సైదులుకు దరఖాస్తు పెట్టుకున్నారు. పని పూర్తి కావాలంటే కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉండే వెంకటయ్య గౌడ్ను కలవాల్సిందిగా తహశీల్దార్ సూచించారు. 
 
వెంకటయ్య గౌడ్ను బాధితుడు కలవగా... ఆయన రూ. 6 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు 5 లక్షలకు ఒప్పందం కుదిరింది. రూ.5 లక్షలు సిద్ధం చేసుకున్న రాములు ఏసీబీ అధికారులను సంప్రదించారు. వెంకటయ్య గౌడ్ ఇంటి వద్దకు వెళ్లి లంచంగా డిమాండ్ చేసిన రూ. 5 లక్షలను ముట్టజెప్పారు. ఈలోపు ఏసీబీ అధికారులు దాడులు చేడని గమనించిన వెంకటయ్య గౌడ్ తలుపులు మూసి నగదును గ్యాస్ స్టవ్‌పై కాల్చేశారు.
 
ఏసీబీ అధికారులు బలవంతంగా తలుపులు తెరిచే లోపు 70 శాతం నోట్లు కాలిపోయాయి. నోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏకకాలంలో తహశీల్దార్ సైదులుకు చెందిన ఎల్బీనగర్లోని నివాసంలో, వెల్దండ తహశీల్దార్ కార్యాలయం, జిల్లెలగూడలోని వెంకటయ్య గౌడ్ ఇంట్లో... సోదాలు నిర్వహించినట్లు మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు