తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను తక్షణం రిలీజ్ చేస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్లను తక్షణం పంపిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ లేదా బూస్టర్ డోస్ ప్రక్రియ మరింత సాఫీగా సాగేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతకుముందు కోవిషీల్డ్ వ్యాక్సిన్లు సరఫరా చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ టి.హరీష్ రావు, కేంద్ర మంత్రి మాండవీయకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ తక్షణం 50 లక్షల వ్యాక్సిన్ డోస్‌లను తక్షణం పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం 106 శాతం ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తికాగా, రెండో డోస్ 104 శాతం మేరకు పూర్తయింది. అయితే, 18 యేళ్ళలోపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.