ఈ షెడ్యూల్ ప్రకారం తొలి దశలో అభ్యర్థులకు కేటాయించిన చేసిన సీట్లు రద్దు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28గా నిర్ణయించారు. అలాగే, ఆన్‌లైన్‌లో అభ్యర్థుల దరఖాస్తు, ఫీజు చెల్లింపులు 25, 26వ తేదీల్లో జరగనున్నాయి. తుది దశలో స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న జరుగుతుంది.
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వ్యక్తిగత రిపోర్టింగ్‌ను నవంబరు 2 నుంచి 5వ తేదీలోపు పూర్తి చేయాలి. కేటాయించిన కాలేజీల్లో నవంబరు 2 నుంచి 6వ తేదీలోపు రిపోర్ట్ చేయాలి. చివరి ఫేజ్‌లో కేటాయించిన సీటు క్యాన్సిల్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబరు 7లోపు ఈ ప్రక్రియ పూర్తిచేసుకోవాలి.
స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అభ్యర్థులు తమ సీటు క్యాన్సిల్ చేసుకోవడానికి నవంబరు 15 వరకూ అవకాశం ఉంది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ ఇంజినీరింగ్, బీఫార్మసీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను నవంబరు 14న తేదీన వెబ్‌సైట్‌లో ఉంచుతారు.