ఎంగిలి పాలలో గేదెలు తాగే మురికి నీటిని కలిపాడు.. షాకింగ్ వీడియో

బుధవారం, 19 ఆగస్టు 2020 (18:35 IST)
హైదరాబాద్ నగరంలో మరో ఘోరం వెలుగు చూసింది. ఓ డైరీ ఫామ్‌లో పని చేసే కార్మికుడు చేసిన పనికి ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు. పాడి గేదె నుంచి పాలు పితికిన ఆ వర్కరు... కొద్దిగా తాగాడు.. మిగిలిన ఎంగిలి పాలను పాల బక్కెట్‌లో పోశాడు. తాను తాగడం వల్ల పాల కొలత తగ్గాయి. దీంతో గేదెలు నీరు తాగేందుకు కట్టిన సిమెంట్ నీటి తొట్టిలోని నీటిని తీసి పాల బక్కెట్‌లో పోశాడు. ఈ తంతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... ఆ డైరీ ఫాం యజమానితో పాటు.. పాలలో మురికి నీటిని కలిపిన వర్కరుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 
హైదరాబాద్ నగరంలోని దబీర్‌పురలోని గోల్ఖబార్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దబీర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ఖబార్‌కు చెందిన మహ్మద్ సోహైల్ అనే వ్యక్తికి జహంగీర్‌ డెయిరీ ఫామ్ ఉంది. ఈ డెయిరీ ఫామ్‌లో యువకుడు బర్రెలకు మేత వేయడం, బర్రెలను శుభ్రం చేయడం, పాలు పితకడం వంటి పనులు చేస్తున్నాడు. 
 
అయితే, తాజాగా ఓ బర్రె నుంచి పాలు పితికిన ఆ వర్కరు.. బక్కెట్‌లో పోశాడు. ఆ తర్వాత చెంబులోని కొన్ని పాలను తాను తాగి మిగిలిన ఎంగిలి పాలను మళ్లీ బకెట్‌లో కలిపాడు. అనంతరం పాడీ ఫాంలో పశువులు తాగడానికి ఉంచిన నీటినే పాలల్లో కలిపాడు. పాడి ఫాం పక్కింట్లో నివసిస్తున్న వ్యక్తి ఈ మొత్తం తతంగాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
 
ఈ వీడియో సోషల్ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్థానికులు సోహైల్‌పై పోలీసులక ఫిర్యాదు చేశారు. దీంతో డెయిరీ ఫామ్ యజమానితో పాటు పాడపనికి పాల్పడిన వర్కరుపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 269, 272, 273 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగా, డెయిరీ ఫామ్‌ను కూడా సీజ్ చేశారు.


 

#Hyderabad- Case registered against Jahangir Diary Farm, under Dabeerupura Police Station Limits, for milk adulteration. Case registered against owner, worker under sections 269, 270, 272 IPC. #Telangana pic.twitter.com/N1JUWaXduE

— Rishika Sadam (@RishikaSadam) August 19, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు