మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం మేరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడింది.
అయితే, ఈ చిత్రంలో హీరో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ తాజాగా లీక్ చేశాడు. ఇది మెగా ఫ్యాన్స్‌ను ఎంతగానో ఖుషి చేయనున్నారు. "అందరివాడు" చిత్రం తర్వాత చిరంజీవి డబుల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం.
కాగా, ఈ చిత్రం నక్సలైట్ నేపథ్యంలో కొనసాగనుంది. అలాగే, ఆలయాల్లో జరిగే పంచలోహ విగ్రహాలు స్మగ్లింగ్‌ను ఇతివృత్తంగా చేసుకుని, ఈ చిత్రం కథ సాగుతుందని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.