ఎఫ్ 3లో మహేష్‌ బాబు గెస్ట్ రోల్ నిజమేనా..? (video)

సోమవారం, 11 మే 2020 (16:07 IST)
విక్టరీ వెంకటేష్‌, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ఎఫ్ 2. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్ 3 తీయాలనుకున్నారు.
 
అంతేకాకుండా... నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే... ఈ సీక్వెల్లో వెంకీ, వరుణ్‌తో పాటు మరో హీరో కూడా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. మాస్ మహారాజా రవితేజ ఆ మూడవ హీరో అంటూ వార్తలు వచ్చాయి కానీ.. రవితేజ బిజీగా ఉండటం వలన ఇందులో నటించడం లేదని టాక్ వచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫ్ 3లో నటించనున్నాడని జోరుగా వార్తలు వచ్చాయి. 
 
మహేష్ బాబుని కాంటాక్ట్ చేసిన మాట వాస్తవమే అని.. కానీ.. కొన్ని కారణాల వలన కుదరలేదు అని ప్రచారం జరిగింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఇందులో మహేష్‌ బాబు గెస్ట్ రోల్ చేయడం నిజమే అని మళ్లీ వార్తలు వస్తున్నాయి. మహేష్‌ - అనిల్ రావిపూడి మధ్య మంచి అనుబంధం ఉంది. 
 
అలాగే వెంకీ - మహేష్ మధ్య కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అందుచేత మహేష్‌ ఇందులో గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. త్వరలో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో క్లారిటీ రానుంది. ప్రచారంలో ఉన్నట్టుగా మహేష్ ఎఫ్ 3లో నటిస్తే... బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సక్సస్ సాధించడం ఖాయం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు