సాయిపల్లవికి అక్కడ అంతగా కలిసిరాలేదట..! (video)

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (16:53 IST)
ప్రేమమ్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రేమమ్ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఫిదా చేసి ప్రస్తుతం కోలీవుడ్‌లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు కోలీవుడ్‌లో చేస్తున్న ప్రయత్నాలు అన్ని కూడా విఫలమవుతున్నాయి. తెలుగులో దక్కినంత స్టార్ డమ్ క్రేజ్ ఈ అమ్మడికి అక్కడ దక్కడం లేదు అని చెప్పక తప్పదు.
 
తమిళంలో చేసిన మారి 2, ఎన్జీకే చిత్రాలు నిరాశ పర్చాయి. ఆ రెండు సినిమాల్లో ఈమె పాత్రలు ట్రోల్స్ ఎదుర్కొన్నాయి. మారి 2, ఎన్జీకే చిత్రాల్లో ఈమె ఓవర్ యాక్షన్ చేసిందంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో అక్కడి ప్రేక్షకుల్లో ఈమెపై బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. అందుకే అక్కడ కొత్తగా ఆఫర్లు రావడం లేదు అనే టాక్ వినిపిస్తుంది. 
 
ప్రస్తుతం తెలుగులోనే రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో మాత్రం సినిమాలు ఏమీ చేయడం లేదు. తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్‌గా మోస్ట్ వాంటెడ్ క్రేజీ స్టార్‌గా దూసుకుపోతుంది. మరోవైపు ఈమెకు మలయాళం నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. కాని వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలుగు మరియు తమిళ సినిమాలపై ఈమె ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు