రవితేజ.. ఆ రైటర్, డైరెక్టర్ ఇద్దరినీ కలిపాడా..?

ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:59 IST)
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం "క్రాక్". ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత  రమేష్ వర్మ డైరక్షన్‌లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు మరో వార్త బయటకు చ్చింది కానీ.. ఇంకా అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. 
 
ఇదిలాఉంటే... రవితేజ మరో సినిమాకి ఓకే చెప్పాడని తెలిసింది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే... రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, 'నేను లోకల్' ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నాడట. 
 
రైటర్ ప్రసన్న కుమార్, డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఇద్దరు కలిసి సినిమాలు చేసినప్పటికీ ఆతర్వాత వీరిద్దరి మధ్య డిఫరెన్సస్ రావడంతో విడిపోయారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి రవితేజ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. 
 
కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. ఇది ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అట, ముఖ్యంగా... సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్‌తో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని.. తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. చిరు 'చంటబ్బాయి' సినిమాకి ఈ సినిమా సీక్వెల్‌గా ఉండబోతుందని సమాచారం. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు