జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ రవితేజతో కొత్త సినిమా అప్డేట్ !

డీవీ

బుధవారం, 24 జనవరి 2024 (11:20 IST)
Ravi teja
జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ ఈాసారి మాస్ మహరాజా రవితేజతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రం రవితేజ ఫార్మెట్ లో వుంటూ అనుదీప్ తరహాలో ఎంటర్ టైన్ మెంట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అనుదీప్, ప్రిన్స్ అనే సినిమాతో శివకార్తికేయన్ తో చేశాడు కానీ పెద్దగా లాభం లేకుండా పోయింది. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా రవితేజను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
 
ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 23" గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో క్యారెక్టర్ల కోసం కాస్టింగ్ కాల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే నాడు ప్రారంభం కానున్నదని సమాచారం. కన్నడ సినిమా సప్తసాారాలు దాటి లో నటించిన రుక్మిణి వసంత్ నాయికగా ఎంపికయినట్లు సమాచారం.
 
ఇక రవితేజ సంక్రాంతికి రావాల్సిన ఈగెల్ సినిమా ఫిబ్రవరి 9 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పలు ప్రమోషన్లను ఇప్పటికే ప్రారంభించారు. ఛానల్స్, యూ ట్యూబ్ లలో అవి త్వరలో టెలికాస్ట్ కానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు