పెళ్లిని వాయిదా వేసుకున్న సింగర్ సునీత.. ఎందుకంటే? (Video)

మంగళవారం, 15 డిశెంబరు 2020 (21:07 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్యగాయని, బుల్లితెర వ్యాఖ్యాత సునీత త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ మీడియా అధిపతి రామ్‌ వీరపనేనితో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. అలాగే, ఈ నెల 27వ తేదీన వీరి వివాహం జరుగనుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. 
 
కానీ, ఎందుకనో ఈ పెళ్లి వాయిదాపడింది. కొన్ని కారణాల వల్ల వీరి వివాహం వాయిదా పడిందని, డిసెంబర్‌ 27న కాకుండా.. రాబోయే సంవత్సరంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. వాయిదా పడటానికి కారణాలైతే తెలియరాలేదు కానీ.. నూతన సంవత్సరంలో మంచి ముహూర్తం చూసి.. సునీత, రామ్‌ల పెళ్లి జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
కాగా, టాలీవుడ్‌కు చెందిన సీనియర్ సింగర్లలో సునీత ఒకరు. ఈమె తొలి భర్త నుంచి దూరమయ్యారు. విడాకులు కూడా పొందారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారు కూడా సునీత వద్దే పెరుగుతున్నారు. పెళ్లీడుకొచ్చిన బిడ్డలు ఉన్నప్పటికీ సునీత.. రామ్ అనే స్నేహితుడుని వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చింది.
 
డిజిటల్ మీడియా రంగంలో అధినేత రామ్‌ వీరపనేనితో రీసెంట్‌గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సింగర్‌ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్‌, రామ్‌ల వివాహం డిసెంబర్‌ 27న జరగబోతోందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా వీరి వివాహం వాయిదా పడినట్లుగా వార్తలు వినవస్తున్నాయి.  
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు