పోస్టర్‌లో విశ్వక్సేన్ అని గుర్తించడం కష్టం, ఎందుకంటే అతను అద్భుతమైన మేకప్ తో అచ్చు అమ్మాయిలా కనిపిస్తున్నారు చుట్టూ తిరుగుతున్న సీతాకోకచిలుకలు ఎగురుతూ, లైలా పెదవులపై వేలుతో నిశ్శబ్దాన్ని వ్యక్తపరిచే సింబాలిక్ ఫోజ్ లో కనిపిస్తుంది.
ఆకాంక్ష శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.