రేణూ దేశాయ్ చెంతకు పవన్... ఎందుకో తెలుసా?

శుక్రవారం, 23 మార్చి 2018 (10:50 IST)
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణూ దేశాయ్ చెంతకు చేరినట్టు సమాచారం. అలా ఆయన ఉన్నట్టుండి మాజీ భార్య వద్దకు ఎందుకు వెళ్లారన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి.
 
నేడు (మార్చి 23వ తేదీ శుక్రవారం) పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల ముద్దుల కూతురు ఆద్య పుట్టిన రోజు బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్, రేణు.. ఆద్య బర్త్ డేని గతేడాది కలిసి నిర్వహించారు. ఆద్య స్కూల్‌కు వెళ్లి అక్కడి పిల్లలతో దిగిన పిక్‌ను, ఆద్యకు రేణు, పవన్ కేక్ తినిపిస్తున్న పిక్‌ను రేణు గతేడాది సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ కూడా చేశారు. 'పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన బహుమతి బర్త్ డే రోజు వారితో టైమ్ స్పెండ్ చేయడమే' అని రేణు పేర్కొన్నారు. శుక్రవారం ఆద్య బర్త్ డే సందర్భంగా ఈ ట్వీట్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా వీరిద్దరూ కలిసి ఆద్య బర్త్ డే చేయడం అభిమానులకు పండుగలా అనిపించింది. ట్వీట్స్‌తో పవన్, రేణుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు