సుశాంత్ సింగ్ నుంచి రియా డబ్బులు తీసుకున్నారని, ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే బీహార్ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. కాగా, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ప్రాణాలు లేకుండా కనిపించారు. ముంబయి పోలీసులు దీన్ని ఆత్మహత్య కేసుగా భావిస్తూ, విచారణ చేపట్టారు.