ఒడిశాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,068 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసులు 30వేలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 29,175 కేసులు నిర్ధారణ అయ్యాయి. 10,919 యాక్టివ్ కేసులు ఉండగా, 18,061 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్-19 ప్రభావంతో 159 మంది మృతి చెందారు. మరో 36 మంది మృతి చెందారు.
కాగా, గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 కొవిడ్ కేసులు నిర్ధారణ కాగా, 768 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 15,31,669కు చేరాయని తెలిపింది.
అలాగే బీహార్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆగస్టు 16 వరకు పొడిగించారు. ఆగస్టు 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ఆగస్టు 1 నుంచి 16 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. బీహార్‌లో కరోనా కేసుల సంఖ్య 41 వేలు దాటగా ఇప్పటి వరకు 253 మంది మరణించారు.