హీరో శింబుకు వైరల్ ఫీవర్... ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:20 IST)
తమిళ స్టార్ హీరో శింబు శనివారం ఆస్పత్రిలో చేరారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు వైరల్ ఫీవర్ సోకినట్టు తేలింది. దీంతో ప్రాథమిక వైద్య చికిత్స తర్వాత ఆయన్ను ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. 
 
అయితే, శింబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు వ్యక్తిగత పీఆర్వో వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, కోవిడ్ వైరస్ సోకలేదని స్పష్టం చేశాయి. మరోవైపు, తమ అభిమాన హీరో శింబు ఆస్పత్రిలో చేరినట్టు వార్త వెలుగులోకి రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు తేలడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు