మొన్న అసిస్టెంట్- నిన్న అభిమాని.. బాలయ్యకు మళ్లీ కోపం వచ్చింది.. అభిమాని చెంప వాచింది.. (వీడియో)

గురువారం, 17 ఆగస్టు 2017 (11:28 IST)
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కోపాన్ని ఏమాత్రం ఆపుకోలేరు. సెన్సేషనల్ కామెంట్స్ చేయడం, పబ్లిక్‌లో దురుసుగా ప్రవర్తించడం బాలయ్య స్టైల్. పైసా వసూల్ సినిమాని పూర్తి చేసిన మరుసటిరోజే బాలకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా సెట్లో కాలి చెప్పులు తీయడం ఆలస్యం అయ్యిందని.. బాలయ్య అసిస్టెంట్‌ను చెంప పగులకొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మరవక ముందే.. తాజాగా బుధవారం రాత్రి ఓ అభిమానిపై బాలయ్య చేజేసుకున్నారు. 
 
బుధవారం రాత్రి తన అభిమాన హీరో బాలకృష్ణకు దండవేసి ఫోటో దిగాలని భావించిన ఓ యువకుడు బాలయ్య ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నంద్యాలలో తొలి రోజు రోడ్ షోను ముగించుకున్న బాలకృష్ణ.. రాత్రి బస చేసేందుకు ఓ హోటల్ వద్దకు వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. 
 
తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్యకర్త పెద్ద దండ తీసుకుని దాన్ని బాలయ్యకు అలంకరించేందుకు ప్రయత్నించగా, ఏం జరిగిందో ఏమో... బాలయ్య లాగి పెట్టి ఒక్కటిచ్చారు. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. దండ వేసేందుకు పైపైకి రావడం ఒకదశలో పడిపోయే స్థితిలో ఉన్న బాలయ్య అభిమానిపై చేజేసుకున్నాడని ఎమ్మెల్యేలు అంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు