కన్నడ తమిళం, మలయాళం, తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ చలనచిత్ర నటి, మోడల్, డ్యాన్సర్ అయిన హరిప్రియ పుట్టినరోజు నేడు. ఆమె 29 అక్టోబర్ 1991న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో జన్మించింది. హరిప్రియ 2007లో తుళు చిత్రం బడితో తెరంగేట్రం చేసింది.
హరిప్రియ ఆమె ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు, ఆమె బరువు 65 కిలోలు. 30కి పైబడిన సినిమాల్లో ఈమె నటించింది. దక్షిణాది భాషల్లో ఈమె నటించిన చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. తెలుగులో తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహా వంటి సినిమాల్లో కనిపించింది.
అసలు పేరు : శ్రుతి చంద్రసేన, హరిప్రియ, శ్రుతి
వృత్తి : మోడల్, భరత నాట్యం డ్యాన్సర్
అలవాట్లు- చదవడం, సినిమాలు చూడటం, ట్రావెలింగ్
తండ్రి పేరు - ఖుషి మురళీ
తొలి సినిమా- బడి (2007) తుళు