తొలి చూపులోనే ప్రేమలో పడిపోయానంటున్న హీరోయిన్!

మంగళవారం, 17 జులై 2018 (10:02 IST)
ఆయన్ను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయినట్టు హీరోయిన్ సంజన చెప్పుకొస్తుంది. ఇంతకీ ఆయన ఓ డాక్టర్. ఓ ఆస్పత్రి యజమాని. ఆ ఆ ఆస్పత్రిలో నిర్వహించిన హెల్త్ క్యాంపు కోసం వెళ్లి ఆయనతో ప్రేమలో పడినట్టు ఆమె తెలిపింది.
 
బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ కావడం పెద్ద విశేషం కాదు. ఈ రోజుల్లో చాలా మంది నటులకు బుల్లితెర తరువాత వెండితెరే మంచి ఆప్షన్‌గా కనబడుతోంది. కానీ, కన్నడ నటి సంజన మాత్రం సినిమాల్లో హీరోయిన్‌గా కొనసాగుతూనే బుల్లితెర మీద మెరవడానికి సిద్ధమైంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, తనకంటూ ఓ ముద్ర వేయగలిగింది సంజన. నటనతో పాటు వ్యాపారంలోనూ మంచి పట్టు ఉన్న సంజన తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో తను ప్రేమలో ఉన్నానని, ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పేసింది.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'తెలుగులో ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారం కాబోతున్న స్వర్ణఖడ్గం సీరియల్‌లోని ఓ పాత్ర కోసం ఆ సీరియల్ దర్శకనిర్మాతలు నన్ను కలిశారు. ఈ సీరియల్‌లో చేయడానికి మరొక కారణం ఏమిటంటే కథ. ఆ కథలో నా పాత్ర. టీవీ సీరియల్స్ చేస్తున్నంత మాత్రాన సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టను. వాటి దారి వాటిదే. వీటి దారి వీటిదే అని చెప్పింది. 
 
ఇకపోతే, తన ప్రేమ గురించి చెప్పాలంటే... నిజంగానే నేను ప్రేమలో పడిపోయాను. ఆయన ఓ డాక్టర్. ఓ హాస్పిటల్‌లో నిర్వహించిన హెల్త్ క్యాంపుకి నేనూ వెళ్లాను. అక్కడ ఆయన పరిచయమయ్యారు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. ఈ విషయం మా ఇంట్లో కూడా తెలుసు. ప్రేమలో ఉన్నాను కదా.. అని వివరాలు అడగవద్దు. అవి మాత్రం చెప్పను. అవి రహస్యంగా ఉంచాలనుకుంటున్నా. ఇప్పుడప్పుడే చెప్పను. అయినా ఆయన గురించి ఇప్పుడవసరమా? నాకు నేనుగా లవ్‌లో ఉన్నానని చెబుతున్నాను కదా. ఇంక పేరెందుకు అంటూ ఎదురు ప్రశ్నవేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు