ఓటీటీలోకి కడావర్.. ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్

సోమవారం, 1 ఆగస్టు 2022 (20:23 IST)
సంచలన నటి అమలాపాల్ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తీసిన సినిమాలు పెద్దగా ఆడసేదసినిమాల కంటే వ్యక్తిగత విషయాల్లోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తమిళ హీరో ధనుష్ కారణంగానే ఆమె తన భర్తకు దూరమయినట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజాగా అమలాపాల్ నిర్మాతగా మారింది. 'కడావర్' పేరుతో సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషించింది. మెడికల్ క్రైమ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో హరీశ్ ఉత్తమన్, మునీశ్ కాంత్, పశుపతి, నిళల్ గళ్ రవి తదితరులు నటించారు. 
 
ఈ సినిమాను అమలా పాల్ నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 12 నుంచి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు