'యానిమల్' ట్రైలర్ విడుదల .. అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌తో..?

సోమవారం, 27 నవంబరు 2023 (13:31 IST)
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ సాగా 'యానిమల్' బ్లడీ టీజర్, అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌తో సంచలనం సృష్టించింది. ఈరోజు యానిమల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
రణబీర్ కపూర్, తన తండ్రి పాత్ర పోషించిన అనిల్ కపూర్‌తో తను చిన్నపిల్లాడిగా వున్నపుడు జరిగిన ఓ సంఘటన చెబుతూ.. ఇప్పుడు చిన్నప్పటి తనలా యాక్ట్ చేయమని తండ్రిని అడిగే ఓ ఇంటెన్స్ సీన్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. 
 
ఈ సన్నివేశం తండ్రి-కొడుకుల కాంప్లెక్స్ రిలేషన్‌కు డ్రమటిక్ అండర్ టోన్‌ను సెట్ చేస్తుంది. అనిల్ కపూర్‌ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చేస్తాడు. రణబీర్ తన తండ్రిని చంపడానికి ప్రయత్నించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పుడు, రణబీర్, బాబీ డియోల్ మధ్య వైలెంట్ ఫేస్ అఫ్ తెరపైకి వస్తుంది. 
 
రణబీర్ కపూర్ తన నట విశ్వరూపం చూపించారు. తన పాత్ర ఆర్క్ మైండ్ బ్లోయింగ్‌గా వుంది. యువకుడు, భర్త, ప్రతీకారం తీర్చుకునే కొడుడు ఇలా చాలా కోణాలు వున్న పాత్రలో రణబీర్ కపూర్ బ్రిలియంట్‌గా నటించారు. 
 
అనిల్ కపూర్ తండ్రి పాత్రలో ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. రష్మిక మందన్న రణబీర్ భార్యగా తన పాత్రలో ప్రేక్షకులని కట్టిపడేసింది. డైలాగ్స్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. 
 
మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. 'యానిమల్‌'ను భూషణ్ కుమార్ అండ్ క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా  భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. 
 
ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలుగు వెర్షన్‌ను చాలా గ్రాండ్ విడుదల చేస్తోంది.
 
తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు