ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. బసవతారకరామ క్రియేషన్స్ పై ప్రొడక్షన్ నెం 1 సినిమా బ్రీత్ టైటిల్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో మా పెదనాన్న నందమూరి జయకృష్ణ గారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మా అన్నగారైన నందమూరి చైతన్యకృష్ణ గారు ఈ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఇది ఎమోషనల్ థ్రిల్లర్. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ అలరిస్తుందని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు
తారాగణం: నందమూరి చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్ , కేశవ్ దీపక్, మధు నారాయణ్, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, అయిషాని, సహస్ర తదితరులు