బిగ్ బాస్ షోలో అరియానా.. అవినాష్‌లు ఇద్దరూ కలిసే ఉన్నారు. వారు బయటకు వచ్చేంత వరకు ఒకరిని ఒకరు విడిచి ఉండనేలేదు. అవినాష్‌ను అరియానా సపోర్ట్ చేయడం, అరియానాను అవినాష్ సపోర్ట్ చేయడం చూసే ఉంటారు. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా కొన్నిరోజుల పాటు నడిచింది.
బయటకు వచ్చిన తరువాత వారిద్దరు వివాహం చేసుకుంటారు, ప్రేమపక్షుల్లా విహరిస్తారని అభిమానులే సందేశాల మీద సందేశాలు పంపారు. అయితే బిగ్ బాస్ షో ముగియకముందే వారిద్దరు ఎలిమినేట్ అయి వచ్చేశారు. ఇప్పుడు హడావిడిగా వెండితెర షోలో కనిపిస్తూ మురిపిస్తున్నారు.