సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఆయన్ను గురించి సినిమాలో ప్రముఖులు తలచుకున్నారు. రాజకీయనాయకులైన చంద్రబాబు కూడా సోషల్ మీడియాలో ఆయనతో వున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ ఫొటో కూడా పెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి... సినీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న తెలుగు సినీ కథానాయకుడు, సాహస నిర్మాత కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన సినీరంగానికి, కళామతల్లికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను అని చంద్రబాబు ప్రకటించారు.