దిల్ రాజు ఆఫీస్ మార్చేసాడా..?

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (13:05 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. సమ్మర్లో రావాల్సిన వకీల్ సాబ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... దిల్ రాజు ఆఫీస్ మార్చనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దిల్ రాజు సడన్‌గా ఆఫీస్ మార్చడం ఏంటి అనుకుంటున్నారా..?
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... దిల్ రాజు ఎఫ్ 3 మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా రూపొందే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ నటించనున్నారు.
 
 సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే.. ఈ మూవీ కోసం దిల్ రాజు హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో కొత్త ఆఫీస్ తీసుకున్నారట.
 
ఈ విషయం తెలిసి దిల్ రాజు ఆఫీస్ మార్చారనుకుంటున్నారు. వెంకీ నారప్ప మూవీ చేస్తున్నారు. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నారు. ఈ హీరోలిద్దరూ ఈ సినిమా షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఎఫ్ 3 షూటింగ్ స్టార్ట్ చేస్తారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2021 సమ్మర్లో ఎఫ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్ 2తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన వెంకీ, వరుణ్ ఎఫ్ 3తో ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు