బాలక్రిష్ణ చాలా సరదాగా వుంటారు. గోల్డ్ స్పూన్ అనే గర్వం వుండదు. స్వంత బేనర్ లో సినిమా అయితే ప్రతీ ఆర్టిస్టునూ టిఫిన్లు, కాఫీలు అందాయా? అని అడుగుతుండేవారు. సాధారణ హీరోలా బిహేవ్ చేసేవాడు. అనసూయమ్మగారి అల్లుడు చేశా. ఆ తర్వాత రక్తాభిషేకం యాక్షన్ సినిమా చేశాను. నారీ నారీ నడుమ మురారి.. కామెడీ, ఫ్యామిలీ సినిమా చేశాను. ఇందులో ఒక్క ఫైట్ కూడా లేదు. భలేదొంగ, బొబ్బిలి సింహం చేశాను అని దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెలియజేశారు. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వూలో అలనాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.