మద్యం సేవించిన ఎవరైనా కామ్ గా పడుకోవాలని, తాగినప్పుడు బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందని అతిగా ఆలోచిస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడతారనే విషయాన్ని "తాగితే తందానా" సినిమాలో ఫన్నీగా చూపించామని, అందుకే సినిమాకు డోంట్ డ్రింక్ అండ్ థింక్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశామని మేకర్స్ చెబుతున్నారు. క్రైమ్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే "తాగితే తందానా" సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.
నటీనటులు - త్రిగుణ్, సప్తగిరి, సత్యం రాజేశ్, మధునందన్, విష్ణు ఓయ్, సిమ్రాన్ గుప్తా, రియా, తదితరులు