ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతూ వచ్చారు. ఈ సమస్యలు మరింతగా ముదిరిపోవడంతో హైదరాబాద్ నగరం, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాల సమాచారం.
'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి, అదే సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
మలయాళ సూపర్ హిట్ మూవీ 'దృశ్యం' హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించింది నిషికాంతే. 'ముంబై మేరీ జాన్', 'ఫోర్స్', 'లై భారీ' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మూవీ 'హవా ఆనే దే', మరాఠీ సినిమా 'సాచ్య ఆట ఘరాట్' సినిమాల్లో నటించారు కూడా. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించిన 'రాకీ హ్యాండ్సమ్' సినిమాలో విలన్ గానూ నటించి మెప్పించారు.