పెండ్లికి ముందు పలు భిన్నమైన సినిమాలు పాత్రలు చేసిన నమిత ఆ తర్వాత పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంది. తమిళ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కానీ కొన్ని టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది. ఆ తర్వాత తన ప్రియుడు వీరేంద్రను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నమిత సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఆమె శరీరం భారీగా పెరిగిపోయింది.
ఆమధ్య ఓ ఫంక్షన్కు వెళితే లావు తగ్గాలని నిర్వాహకులు సూచించారట. అక్కడి అభిమానులు కూడా ఆమెను నాజూగ్గా చూడాలనుకుంటున్నారని చెప్పారు. దీంతో తనను తాను మలచుకోవడానికి సిద్ధమైంది. అందుకు నమిత ఓ కఠిన నిర్ణయం తీసుకుని, తన శరీర బరువును తగ్గించేందుకు జిమ్లో పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది.