అఖండలో ఒరిజినల్ అఘోరాలా కేశాలతో వుండలేదు?
ఈ ప్రశ్న నా ఫ్యాన్స్ కూడా నాకు చెప్పలేదు. అఘోరాల పాత్ర అనగానే శివునిలా జటాజూటాలుంటాయి. హిమాచలప్రదేశ్‌లో చాలామంది అఘోరాల గురించి ఫొటోలు వారి గురించి వివరాలు ఫ్యాన్స్ పంపారు కూడా. అందులో వారు జుట్టు కత్తిరించుకోరు. కేశాలు చాలా పొడుగుగా వుంటాయి. ఒక్కోసారి వారి తపస్సు చేస్తుంటే మంచులో వుండిపోతాయి.
వారు అవసరం అయినప్పుడు జుట్టతో కిందనుంచి నీళ్ళను రప్పించి మీద పోసుకునేవారు. ఇక సినిమా పరంగా చూస్తే, నన్ను అంత జట్టు వుంటే గుర్తుపట్టరు. కేవలం పాత్ర కనిపించాలి. హీరోలు ఎవరైనా సరే ఆ పాత్ర చేసినా ఇలానే చేస్తారు. అందుకే జుట్టు పెంచలేదు. పెంచితే అఘోరాల అయ్యప్ప శర్మలా అయిపోతాను. ఎవరూ గుర్తుపట్టేవారుకాదు అంటూ చలోక్తి విసిరారు.