తండ్రి కుర్చీ కోసం ఆశపడటంలో ఎలాంటి తప్పులేదనీ కానీ, ఆ కుర్చీలోకూర్చొనేందుకు మనం అర్హులమా కాదా అనే విషయాన్ని ఆలోచన చేయాలని కోలీవుడ్ హీరో విజయ్ అన్నారు. ఆయన తన చిత్రం లియో ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ విజయ్ మాత్రం ఉదయనిధిని లక్ష్యంగా చేసుకునే విమర్శలు గుప్పించారనే ప్రచారం సాగుతుంది.
తన మనస్సులోని మాటను వెల్లడించేందుకు విజయ్ చెప్పిన ఓ పిట్టకథకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కన్నతండ్రి వేసుకో చొక్కా, ధరించే వాచ్, ఇలా అన్ని వస్తువులు వాడుకోవచ్చు. కానీ, ఆ చొక్కా ధరిస్తే లూజుగా ఉంటుంది. అయినప్పటికీ వేసుకుని సంతోషపడుతారు. తండ్రి కూర్చొనే కుర్చీలో కూర్చోవాలా వద్దా అనే సందేహం ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చొనే అర్హత మనకు ఉందా లేదా అనే అనుమానం ఒకటికి పది సార్లు వస్తుంది. అయినా కూర్చొంటారు. ఎందుకంటే మన తండ్రి కుర్చీ. అందుకే అందులో కూర్చొంటాం. అప్పా సొత్తు అనుభవించే హక్కు ఉందని భావిస్తాం అంటూ కామెంట్స్ చేస్తారు.