ఉపేంద్ర మాట్లాడుతూ, టాలీవుడ్. ఇండియానే కాదు.. వరల్డ్ నే షేక్ చేస్తుంది. 1000 కోట్లు, 2000 కోట్లు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. అయినప్పటికీ ఒక చిన్న టాలెంట్ ని చూసి కూడా గొప్పగా ఆదరిస్తున్నారు. దానికి నేనే నిదర్శనం. మీ ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. బుచ్చిబాబు ఉప్పెన సినిమా చూసి షాక్ అయ్యాను. ఆయన ఫస్ట్ సినిమాల అనిపించలేదు. రామ్ చరణ్ తో నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఐ విష్ హిం ఆల్ ద వెరీ బెస్ట్. బేబీ సినిమా నాకు చాలా నచ్చింది. అలాంటి ఆలోచన దర్శక నిర్మాతలకు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోయాను.
నేను 20 ఏళ్ల క్రితం చేసిన సినిమాల్ని ఇంకా గుర్తుపెట్టుకుని నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలని తపన కలుగుతుంది. ఈ గొప్పతనం అంతా ప్రేక్షకులదే. నిర్మాత కె.పి శ్రీకాంత్ కి ఈ సినిమా ఐడియా చెప్పాను. ఆయన లహరి లాంటి గొప్ప సంస్థని తీసుకొచ్చారు. ఇలా అందరూ కలిసి ఈ సినిమాని ఒక అద్భుతంగా మార్చారు. ఇది రెగ్యులర్ ఫిల్మ్ లాగా ఉండదు. ఒక కొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది ఒక ఇమేజినరీ వరల్డ్ లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అజినీస్, ఆర్ డైరెక్టర్ శివకుమార్, కెమెరామెన్ వేణు, ప్రజ్వల్, ఫైట్ మాస్టర్స్ రవివర్మ థ్రిల్లర్ మంజు ఇలా అందరూ వచ్చి నా విజన్ కి హెల్ప్ చేశారు. రేష్మ ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేసింది. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. రాంబాబు అన్ని సాంగ్స్ బ్రహ్మాండంగా రాశారు. పార్థసారథి ఈ సినిమాని ఒక తెలుగు సినిమాలాగే ప్రజెంట్ చేశారు. నేను చూసుకున్నప్పుడు కన్నడ ఒరిజినలా తెలుగు ఒరిజినలా అనే డౌట్ వచ్చంది.
నాకు చిరంజీవి గారి ఫ్యామిలీతో 30 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయనతో ఒక సినిమా చేయాలని వన్ ఇయర్ ట్రావెలయ్యాను. అప్పుడే తెలుగు ఇండస్ట్రీ స్పెషాలిటీ అర్థమైంది. ఇక్కడ చాలా కష్టపడి ఎన్నో వెర్షన్స్ రాసి ఒక సీను తీస్తారు. ఇక్కడ చాలా నేర్చుకున్నాను. అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అది మాకు చాలా స్పెషల్. యు ఐ సినిమా ఒక మెటఫరికల్ గా ఉంటుంది. ఇందులో సింబాలిజం ఉంటుంది. ఆడియన్స్ మీద కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాని చేశాను. ఈ సినిమాని మీరందరూ డీకోడ్ చేస్తారు. కల్ట్ అనేది ఆడియన్స్ లోనే ఉంది. నా ధైర్యం మీరే. సినిమా ఓపెనింగ్ నుంచే షాక్ అవుతారు. మీరు మైథలాజికల్ కల్కి చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కి చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ కి ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది' అన్నారు.
హీరోయిన్ రేష్మ మాట్లాడుతూ, ఉపేంద్ర గారు యుఐ సినిమాతో ఒక మాస్టర్ పీస్ క్రియేట్ చేశారు. డిసెంబర్ 20న అది మనమందరం విట్నెస్ చేయబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. ఇది నా ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్. తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమాతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ దక్కుతుందని కోరుకుంటున్నాను అన్నారు