రామ్ చరణ్ తో గతంలో క్రిష్ణ వంశీ సినిమాలో నటించాడు. చిరంజీవితో నటించడం కూడా ఆయన నటించారు. కానీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆఫర్ వస్తుందని అనుకోలేదట. ఓసారి శంకర్ నుంచి ఫోన్ వచ్చింది. అదే గేమ్ ఛేంజర్. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఓ పాత్ర కోసం నన్ను అడిగారు. దర్శకుడు మొదట కథ చెప్పగానే ఇలాంటి క్యారెక్టర్ చేస్తే తర్వాత అన్నీ ఇలాంటి పాత్రలే వస్తాయి. పైగా ముసలి పాత్ర కావడంతో వద్దనుకున్నా. అప్పటికి ఫస్ట్ పార్ట్ చెప్పారు. ఆ తర్వాత సెకండ్ ఫార్ట్ లోనూ నా పాత్ర వుందనీ ఆ పాత్ర తీరును చెప్పగానే వెంటనే తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు శ్రీకాంత్ వెల్లడించారు.