సినిమాలు, టీవీ షోలు, ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందింది IMDB. ప్రపంచవ్యాప్తంగా IMDBకి వందల మిలియన్ల నెలవారీ సందర్శకుల ద్వారా నిర్ణయించబడిన 2024 అత్యంత ఆత్రుతతో ఎదురుచూసిన ఇండియన్ మూవీస్ జాబితాను ఆవిష్కరించింది. ఈ సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచిన ఫైటర్ (2024 మోస్ట్ అవైటెడ్ మూవీ) ప్రధాన నటుడు హృతిక్ రోషన్ మాట్లాడుతూ, “ఐఎండిబి లో ఫైటర్ 2024 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ నిలవడం చాలా పాజిటివ్ అప్డేట్. ఫైటర్ టీజర్, పాటలకు గొప్ప స్పందన వచ్చింది. జనవరి 25, 2024న మా ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించాలని మేము ఆశిస్తున్నాము. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మా సినిమాలో కలుద్దాం” అన్నారు.
2024లో విడుదలయిన భారతీయ సినిమాల్లో ఈ సినిమాలు స్థిరంగా ఐఎండిబి వినియోగదారులలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి ఉన్న వందల మిలియన్ల నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించబడ్డాయి. ఐఎండీబీ జాబితాలోని 20 చిత్రాల్లో తొమ్మిది హిందీ సినిమాలు, ఐదు తెలుగు, నాలుగు తమిళ, ఒక మలయాళం, ఒక కన్నడ సినిమా కావడం గమనార్హం. ఫైటర్ (నెం.1), సింగం ఎగైన్ (నెం.4), కల్కి 2898 ఏడీ (నెం.5) చిత్రాల్లో దీపికా పదుకొణె నటిస్తోంది. ఇటీవల ప్రకటించిన ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2023 జాబితాలో ఆమె 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో నాలుగు చిత్రాలున్నాయి: పుష్ప: ది రూల్-పార్ట్ 2 (నెం.2), వెల్ కమ్ టు ది జంగిల్ (నెం.3), సింగం ఎగైన్ (నెం.4), ఇండియన్ 2 (నెం.17).