"అమ్మా... నువ్వు కేన్సర్‌తో చేస్తున్న అలుపెరగని పోరాటానికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఐదేళ్ళలో ఎన్నో సర్జరీలు, మరెన్నో కీమోథెరపీలు. ఎన్నెన్నో నిద్రలేని రాత్రులు, భరించలేని బాధలు, అర్థంకాని అగాథంలోపడిన భవిష్యత్, చికట్లో గమ్యం తెలియని ప్రయాణం, అన్నింటికీ ఒక్కటే సమాధానం.. నీ ఆత్మస్థైర్యం. నువ్వు ఒక గొప్ప అలుపెరగని పోరాటం యోధురాలివి.
అమ్మా... మా అమ్మకి చికిత్స చేసిన, చేస్తున్న వైద్యులందరికీ నా పాదాభివందనం. మా అమ్మ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. తన తల్లి ఐదేళ్ళుగా పడుతున్న ఆవేదనను నాలుగు మాటల్లో కళ్లకు కట్టినట్టు రాసుకొచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.