ఈ సందర్భంగా వారు స్పందిస్తూ 'సూపర్ డా తంబీ.. నీతో పనిచేసేప్పుడు ఎగ్జైట్ అయ్యాం. కొత్త సినిమా రిలీజ్‌కు గుడ్ లక్' అంటూ ట్రైలర్‌తో సహా ట్వీట్ చేశారు. దానికి ధనుష్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పడం, ఆ వెంటనే రుస్సో బ్రదర్స్ మళ్లీ స్పందించడం జరిగిపోయాయి.
ఇదిలా ఉంటే జగమే తందిరం శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళ్, తెలుగుతో సహా పదిహేడు భాషల్లో 190 దేశాల్లో ఈ మూవీ అలరించనుంది. కాగా ధనుష్ పూర్తి వైవిద్యభరితమైన కథలని ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తున్నారు.