అరవై ఏళ్ళ వయస్సులో కూడా యాక్షన్ సినిమాలవైపు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు నాగార్జున. కరోనాకు ముందే వైల్డ్‌డాగ్ అనే సినిమా చేశాడు. అందులో కూడా యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. అయితే అవన్నీ పెద్ద ఎడ్వంచర్ అయిన ఫైట్లు కాదు. ఆ సినిమాతో యాక్షన్ సినిమాలు చేయగలనని నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన చేయబోతున్న సినిమా కూడా పూర్తి యాక్షన్ సినిమా కథగా రూపొందుతోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఏషియన్‌ఫిలింస్ నారంగ్ నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కుముందే సికింద్రాబాద్‌లో వినాయకుడి టెంపుల్‌లో ప్రారంభమైంది. తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు.