తెలుగు దర్శకులు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించినవారిలో కె. రాఘవేంద్రరావు, బాపయ్య, తాతినేని రామారావు, దాసరి నారాయణరావు, మణిరత్నం, ప్రియదర్శన్, రామ్ గోపాల్ వర్మ వున్నారు. అదేవిధంగా తమిళంనుంచి ఎ.ఆర్. మురుగదాస్, అట్లీ కుమార్, సందీప్ రెడ్డి, మరియు గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు హిందీ చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేశారు.
ఇప్పుడు, పుష్ప దర్శకుడు సుకుమార్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారనేది తాజా వార్త. ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌కు దర్శకత్వం వహించనున్నారని రిపోర్ట్ లు తెలియజేస్తున్నాయి. షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో జవాన్ సినిమా చేశారు. ఇది భారీ విజయాన్ని సాధించింది. అలాగే పుష్ప 2తో బ్లాక్‌బస్టర్‌లను అందించిన సుకుమార్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం గ్రామీణ రాజకీయ యాక్షన్ డ్రామాగా ఉంటుందనే భావిస్తున్నారు.
కాగా, సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో RC 17, ఆ తర్వాత పుష్ప 3: ది రాంపేజ్ చిత్రాలు చేసే పనిలో వున్నాడు. మరోవైపు షారూఖ్ కు పఠాన్ 2 ఉన్నాయి. వారి షెడ్యూల్‌లను బట్టి చూస్తే, సుకుమార్, షారుఖ్ ఖాన్ రెండేళ్ళ తర్వాత చేస్తారేమో అనిపిస్తుంది. కానీ వాటిలో ఏదో ఒకటి ఆలస్యమైతే షారూఖ్ తో చేయడానికి వీలుకుదురుతుందని తెలుస్తోంది.