కల్కి 2898AD ముగింపు 30 రోజుల్లో పూర్తికానుంది

డీవీ

బుధవారం, 29 మే 2024 (11:11 IST)
Kalki 2898AD new poster
ప్రభాస్, సీనియర్ బచ్చన్ కమల్ హాసన్, ప్రభాస్, దీపికాపదుకొనే తదితరులు నటించిన సినిమా  కల్కి  2898AD . ఈ సినిమా ముగింపు మరో 30 రోజుల్లో ముగింపు వుందనీ, రిలీజ్ ప్రారంభం అవుతుందని అర్థం వచ్చేలా ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదలచేసింది. ఈ సినిమా సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ గా అడ్వాన్స్ టెక్నాలజీ ఊహాతీతమైన కథతో రాబోతుంది
 
 దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు జరుగుతున్నాయి. ఫిలింసిటీతోపాటు ఇతర దేశాల్లో గ్రాఫిక్స్, విజువల్ వర్క్ జరుగుతోంది. వైజయంతీ మూవీస్ యాభై సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు. కల్కి 2898AD జూన్ 27న థియేటర్లలోకి వస్తుందిఅని ప్రకటించారు. 
 
ఈ సినిమాలో  సీనియర్ బచ్చన్ కమల్ హాసన్, ప్రభాస్, దీపికాపదుకొనే, దిశా పటానీ తదితరులు నటించారు. సంతోష్ సంగీతం సమకూర్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు