కమల్ హాసన్ పరాజయం: నేను చాలా గర్వపడుతున్నానంటున్న శ్రుతి హాసన్

మంగళవారం, 4 మే 2021 (10:11 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సూపర్ స్టార్ కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ కమల్ కుమార్తె శ్రుతి హాసన్ మాత్రం తన తండ్రిని చూసి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఆయన పోరాట పటిమను చూసి తను ఎప్పుడూ గర్వపడుతుంటానని చెప్పింది.
 
తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొద్దిసేపటికే తన తండ్రిపై ఆప్యాయత చూపిస్తూ శ్రుతి ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. మక్కల్ నీతిమయ్యం పార్టీ నాయకుడు కమల్ హాసన్ తన రాజకీయ అరంగేట్రంలో ఓటమిని ఎదుర్కొన్నారు. బిజెపి జాతీయ మహిళా వింగ్ లీడర్ వానతి శ్రీనివాసన్ నటుడు కమల్ హాసన్‌ను 1,300 ఓట్ల తేడాతో ఓడించారు.
 
ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, “నా తండ్రి గురించి ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఆయన #Fighter #Terminator” అని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు