సినీ రంగంపై మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివక్ష చూపుతోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందనీ, దీంతో పలు రాష్ట్రాలు సినియా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చాయని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వలేదని కంగనా ఆరోపిస్తున్నారు.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అనేక రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించపోవడం సరికాదని, సినీరంగంపై ఆ రాష్ట్ర సర్కారు వివక్ష చూపుతోందని ఆమె ఆరోపణలు గుప్పించారు.
మహారాష్ట్ర పభుత్వం సినీ పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ దీనిపై ఎవరూ మాట్లాడకపోవడం శోచనీయమని చెప్పారు. కాగా, కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా విడుదల నేపథ్యంలోనూ మహారాష్ట్రలో ప్రభుత్వం థియేటర్లను తెరవడానికి అనుమతులు ఇవ్వని పరిస్థితి తెల్సిందే.