జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విశ్లేషకులు కత్తి మహేష్ మండిపడ్డాడు. అసలు రాజకీయ పరిజ్ఞానం కానీ, పరిణితి కానీ పవన్‌కు లేవని ధ్వజమెత్తాడు. ఇన్నాళ్ల పాటు చర్చా కార్యక్రమాల్లో పవన్‌ను ఏకేసే కత్తి మహేష్.. పవన్ అభిమానులతో సవాల్ విసిరేవాడు. కానీ ప్రస్తుతం ఏకంగా పవన్‌పైనే విమర్శలు చేశాడు.
పెళ్లాన్ని కాపాడుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడని ఎద్దేవా చేశాడు. పార్టీ ఆఫీసును ప్రారంభించి.. దానికి పూజలు చేసినంత మాత్రాన నాయకుడు అయిపోడని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసలు పవన్‌కు కామన్‌సెన్సే లేదని, ప్రజాస్వామ్యం గురించి అస్సలు తెలియదని కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. ఇంకా పవన్ ఓ జోకర్ అని ఆయనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా కత్తి మహేష్ సవాల్ విసిరాడు.
రాజకీయంగా పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు తాను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని కత్తి మహేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా, తాను కూడా అక్కడి నుంచే ఆయనపై పోటీకి నిలబడతానని... పవన్ దిగజారుడు రాజకీయాలను ఎండగడతానని చెప్పాడు.