'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి రాకెట్‌లా దూసుకొచ్చింది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూలు కడుతున్నాయి.
ఇటీవల ఈమె నటించిన 'ది వారియర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి అంటే అందుకు కృతి శెట్టి క్రేజ్ కూడా ఓ కారణమని చెప్పాలి. ఈమె నితిన్‌కు జోడీగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది.
సోషల్ మీడియాలో కృతి శెట్టి మూతి గురించి కొంతమేర ట్రోలింగ్ జరుగుతుంది. ఆమె పెదాలు కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి అనే విమర్శ ఉంది. అందుకోసమే ఆమె తన ఫేస్‌కి సర్జెరీ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఆమె సర్జరీ చేయించుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా స్పష్టమవుతుంది.