సినిమా షూటింగ్‌లు విదేశాల్లో చేస్తే చాలామంది హీరోహీరోయిన్లు ఎంజాయ్ చేస్తుంటారు. అదే పల్లెటూరంటే భయపడిపోతుంటారు. కొంతమంది హీరోలైతే పల్లెటూరులో షూటింగ్ అయితే ఆనందపడిపోతుంటారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం పల్లెటూరులో షూటింగ్ అంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం 25వ సినిమాలో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఇప్పటికే డెహ్రాడూన్‌లో సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
పల్లెటూరులో సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు సినిమా షూటింగ్ పల్లెటూరులో వద్దని తేల్చి చెప్పేస్తున్నాడట. కారణం.. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, సమంతలు తూర్పుగోదావరి జిల్లాలో సినిమా షూటింగ్‌లో పాల్గొని అనారోగ్యం పాలయ్యారట. అంతేకాదు మహేష్ బాబు కూడా భరత్ అనే నేను సినిమాలో ఒక గ్రామంలో నటించి కొన్నిరోజుల పాటు అక్కడే ఉండడంతో అనారోగ్యానికి గురయ్యారట.