పెళ్లి చేసుకునే పిల్లల్ని కనాలని రాసిపెట్టివుందా? బాలీవుడ్ నటి

బుధవారం, 3 జులై 2019 (12:24 IST)
బాలీవుడ్ నటి మహిగిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లన్ని కనాలంటే పెళ్లి చేసుకోవాలనే నిబంధన ఉందా అంటూ ప్రశ్నించారు. పైగా, తనకు వెరోనికా అనే కుమార్తె ఉందని చెప్పుకొచ్చింది. లీవుడ్ నటి మహిగిల్ సంచలన విషయాన్ని వెల్లడించింది. తనకు వెరోనికా అనే కూతురు ఉందని తెలిపింది. 
 
43 యేళ్ల ఈ బాలీవుడ్ నటి... పలు చిత్రాల్లో నటించింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే నెలలో తన బిడ్డకు రెండేళ్లు నిండుతాయని చెప్పింది. తాను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదని... అయితే రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు చెప్పింది. ఆ సంబంధం ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చి.. తల్లినైనందుకు తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. పైగా, తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. 
 
పైగా, పెళ్లి చేసుకోవాల్సి అవసంర ఏముందని ఆమె ప్రశ్నిస్తోంది. మన ఆలోచనలు, సమయాన్ని బట్టి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. పెళ్లి చేసుకోకుండానే కుటుంబం, పిల్లల్ని కలిగిఉండవచ్చని తెలిపింది. పెళ్లి కాకుండానే పిల్లల్నికనడంలో ఎలాంటి సమస్య లేదని చెప్పింది. పెళ్లి చాలా అద్భుతమైనదని... అయితే పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత నిర్ణయమని మహిగిల్ వేదాంత ధోరణితో వ్యాఖ్యానించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు