మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రముఖ హీరోయిన్ మాళవికా మోహనన్ అన్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర "రాజాసాబ్". త్వరలోనే విడుదలకానుంది. ఇందులో హీరోయిన్‌గా మాళవికా మోహన్ నటించారు. ఈ చిత్రంలో అవకాశం రావడంపై స్పందిస్తూ, ప్రభాస్ మంచితనం, సహృదయతకు ఫిదా అయిపోయానని చెప్పింది. ప్రభాస్ వంటి గొప్ప వ్యక్తితో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.
ఈ సినిమాలో ఛాన్స్ రావడాన్ని లక్కీగా భావిస్తున్నానని, ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మించిన ఆనందం ఏముంటుందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. మరోవైపు, హారర్ కామెడీ థ్రిల్లర్‌గా "ది రాజా సాబ్" తెరకెక్కుతోంది.