నెల్లూరులో ముఠా మేస్గ్రీగా వుంటూ, టెంట్ హౌస్ నిర్వహిస్తున్న శ్రీరాంబాబు అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ తో 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ ఓ యూ ట్యూబ్ చానల్ కు వివరించారు. బెట్టింగ్ గేమ్ అనేది వ్యవసనం అని నిదానంగా అలవాటు అయిపోతామని అంటున్నాడు. కరోనా తర్వాత టీవీలో అన్ స్టాపబుల్ షో లో బాలక్రిష్ణ హోస్ట్ గా, ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా వచ్చారు. ఆ షోలో ఫన్ 88, స్పైట్, రియల్ మి యాప్ లో స్పాన్సర్ గా వచ్చారు.
2023 లో ఈ యాప్ మొదలైంది. ఫేస్ బుక్ లో కూడా ఫన్ 88 యాప్ కూడా వచ్చింది. అందర్ బాహార్ వంటి గేమ్ లు కూడా వుంటాయి. ఈ షోలోనే బాలక్రిష్ణగారు ప్రభాస్ కు ఫన్ 88 గిఫ్ట్ గా షోలో ఇచ్చారు. అందులో బహుమతులున్నాయి. గేమ్ ఆడితే వస్తాయంటూ చెప్పారు. అది చూసి నేను గేమ్ లు మొదలు పెట్టాను. మొదట్లో రాబడి వుంది. తర్వాత పోతూ వున్నాయి. దాదాపు ఇప్పటికీ 80 లక్ష లు పోయాయంటూ ఫోన్ పేలో వివరాలు వున్నాయని చెప్పారు.
గత్యంతరలేక పోలీస్ స్టేషన్ కు వెళితే, పోలీసులకు చెప్పితే నీమీద కేస్ పెడతారంటూ వారు సమాధానం చెబుతున్నారు. నేను ఆత్మ హత్య కూడా చేసుకోవాలనుకుంటున్నాను. పంజాగుట్ట పోలీస్ స్టేష న్ లో కేసులు పెట్టారంటూ.. ఓ ఛానల్ వారు చెబితే, నేను ఇక్కడికి వచ్చానంటూ యూ ట్యూబ్ ఛానల్ కు వెల్లడించారు.