అన్న, వదిన, మరిదిల మధ్య ఆసక్తికర సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. భూమిక ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్‌లో డైలాగ్స్ మాత్రం మూవీపై భారీ అంచనాలే పెంచాయి.
ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.