మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి బాపినీడు, యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ ఇలా..నిర్మాతల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల ఏపీలో వచ్చిన జీవోలో ఉన్నవాటిపై చర్చించారు. సీఎంతో సమస్యల పరిష్కారానికి మార్గాలేమిటి? అన్నదానిపై చర్చించారు. అన్నిటికీ త్వరగా పరిష్కరించాలన్నది ప్రధాన డిమాండ్. చిన్న నిర్మాతల సమస్యలపైనా సీఎంతో భేటీలో చర్చించనున్నారు.
ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్లపై చర్చించనున్నారు. గ్రామ పంచాయితీ, నగర పంచాయితీ, కార్పొరేషన్ ఏరియాల్లో టిక్కెట్టు ధరలపై ఏం అడగాలి? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయమై చర్చించుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిలపై సానుకూల వాతావరణం వచ్చేలా అవన్నీ ఓ కొలిక్కి వచ్చేలా అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి కూలంకుషంగా చర్చించడం ఈ సమస్యలు పరిష్కారం కోసం చర్చించుకోవడం జరిగింది.