భవిష్యత్‌లో చిరంజీవికి "భారతరత్న" కూడా రావాలని కోరుకుంటున్నా : మంత్రి కోమటిరెడ్డి

వరుణ్

శుక్రవారం, 26 జనవరి 2024 (16:14 IST)
పద్మ విభూషణ్ చిరంజీవికి భవిష్యత్‌లో "భారతరత్న" పురస్కారం కూడా వరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి 'పద్మవిభూషణ్' అవార్డును ప్రకటించింది. దీంతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఉదయం సినీ నిర్మాత దిల్ రాజుతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను అభినందించారు. 
 
పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. మెగాస్టార్ మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మరిన్ని అవార్డులు, పురస్కారాలు దక్కించుకోవాలని ఆకాక్షించారు. ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో భారతరత్న కూడా రావాలని కోరుకున్నారు. 
 
"పునాదిరాళ్ల నుంచి విశ్వంభరదాకా కోట్లాది గుండెల్ని కదిలిచించి, రక్తదానం నుంచి నేత్రదానం దాకా లక్షలమందికి పునర్జన్మను ప్రసాదించి, మనందరి మనస్సుల్లో చిరంజీవిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవిగారు ప్రతిష్టాత్మక 'పద్మవిభూషణ్' అవార్డుకు ఎంపికై సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు